Telangana,hyderabad, అక్టోబర్ 7 -- తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త వివాదం మొదలైంది. ఏకంగా ఇద్దరు మంత్రులు కేంద్రంగా ఈ వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంపై మంత్రి పొన్నం ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. అయితే తనపై మంత్రి పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేశారని.తప్పును ఒప్పుహకోని క్షమాపణలు చెప్పాలని మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా బయటికొచ్చింది.

మంత్రి పొన్నం ప్రభాకర్ మా జాతిని మొత్తాన్ని అవమానపరిచాడని అడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు. "నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం నా తప్పా.? పొన్నం ప్రభాకర్ తప్పును ఒప్పుకోని క్షమాపణలు చెప్పాలి. పొన్నం మా జాతిని మొత్తాన్ని అవమాన పరిచాడు.. ఆయన లాగా అహంకారంగా మాట్లాడడం నాకు రాదు. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను పక్కన ఉంటే మంత్రి వివేక్ ఓర్చుక...