Andhrapradesh, జూన్ 26 -- సింగయ్య మృతి కేసులో వైసీపీ అధినేత జగన్ పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిని కొట్టివేయాలని కోరుతూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.

జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామానికి వైఎస్‌ జగన్‌ వెళ్లారు. ఆ పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని.. చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. రాజకీయ ప్రతీకారంతోనే తనపై ఈ కేసు పెట్టారని జగన్‌. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు.

కాన్వాయ్‌లోని గుర్తుతెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా తొలుక ప్రకటించారని క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు. మృతుడి భ...