భారతదేశం, డిసెంబర్ 4 -- పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల పైన 100 శాతం రాయితీ అంటూ వచ్చిన వార్తలు ఈ మధ్య తెగ వైరల్ గా మారింది. డిసెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని. పలు భారతీయ రాష్ట్రాలలో జాతీయ లోక్ అదాలత్ లో వాహనదారులు తమ తమ పాత చలాన్ లను తగ్గించిన జరిమానాలతో పరిష్కరించుకోవచ్చని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇదే వార్తను చాలా మంది నెటిజన్లు షేర్లు కూడా చేస్తున్నారు. ఇది నిజమేమో అనుకొని. వాహనదారులు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని చూస్తున్నారు.

ఈ విషయంపై హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. పలు సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతున్న వార్తలు అవాస్తవమని సిటీ పోలీసులు స్పష్టం చేశారు. 100 శాతం డిస్కౌంట్ అనేది ఫేక్ అని. ఈ విషయంపై ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదని పేర్కొన్నారు.

ఆ రోజు (డిసెం...