భారతదేశం, మార్చి 17 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ రెండో టర్మ్​ సంచనాలకు కేరాఫ్​ అడ్రెస్​గా మారింది. కఠిన నిబంధనలతో వలసదారులను ఆయన భయపెడుతుండటమే కాదు, 'టారీఫ్​లు వేసేస్తా' అని ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇవన్నీ ట్రంప్​నకు అమెరికన్లలో రోజురోజుకు మద్దతును పెంచుతున్నాయి. తాజా ఎన్బీసీ న్యూస్ పోల్ ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 47 శాతానికి చేరుకుంది. ఇది అధ్యక్షుడిగా ఆయన కెరీర్​లోనే అత్యధిక రేటింగ్​తో సమానం! అయితే, 51 శాతం మంది ఆయన పనితీరును ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు.

ఓటర్లు ఆర్థిక వ్యవస్థపై నిరాశావాదంతో ఉన్నారు. ట్రంప్​ ఎకానమీ చర్యలపై కేవలం 18 శాతం మంది మాత్రమే 'అద్భుతమైన' లేదా 'మంచి' అని రేటింగ్ ఇవ్వగా, 43 శాతం మంది 'పేలవమైనది' అని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ వ్యవ...