భారతదేశం, నవంబర్ 3 -- ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్​ 2026 పరీక్షలో ఎలాంటి కాలిక్యులేటర్​ అందుబాటులో ఉండదని నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్టీఏ) తేల్చిచెప్పింది. ఈ మేరకు, అభ్యర్థులకు ఆన్‌స్క్రీన్ వర్చువల్ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుందని రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంది.

సమాచార బులిటెన్‌లో ఆన్‌స్క్రీన్ స్టాండర్డ్ కాలిక్యులేటర్ గురించి మునుపటి ప్రస్తావన "టైపోగ్రాఫిక్ లోపం" కారణంగానే వచ్చిందని ఎన్టీఏ ఆదివారం రాత్రి విడుదల చేసిన నోటీసులో తెలిపింది. ఏజెన్సీ సాధారణ పరీక్షా వేదికలో కాలిక్యులేటర్ సదుపాయం ఉన్నప్పటికీ, జేఈఈ మెయిన్స్​లో మాత్రం దానిని ఉపయోగించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.

"ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన జేఈఈ మెయిన్స్​ - 2026 సమాచార ...