భారతదేశం, సెప్టెంబర్ 12 -- దేశ రాజధానిలోని దిల్లీ హైకోర్టులో శుక్రవారం బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈ బెదిరింపు మెయిల్​తో అప్రమత్తమైన అధికారులు వెంటనే హైకోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు.

బెదిరింపు మెయిల్​ ప్రకారం.. న్యాయమూర్తి గదిలో, కోర్టు ఆవరణలోని ఇతర ప్రాంతాల్లో మొత్తం మూడు బాంబులు పెట్టామని దుండగులు హెచ్చరించారు. ఈ బాంబులు మధ్యాహ్నం 2 గంటల లోపు పేలతాయని, అప్పటిలోగా ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని బెదిరించారు.

మెయిల్​లో "పాకిస్థాన్​ ఐఎస్‌ఐ సెల్స్‌తో సంబంధాలు" ఉన్నాయని కూడా ప్రస్తావించారు. మధ్యాహ్న ప్రార్థనల తర్వాత న్యాయమూర్తి గదిలో బాంబు పేలుతుందని హెచ్చరించారు.

బెదిరింపు మెయిల్​లో పలు వ్యక్తులను, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను ప్రస్తావించారు.

"డా. షా ఫైసల్ అనే యువ షియా ముస్లిం, కోయంబత్తూర్‌లోని పాకిస్థాన్ ఐఎస్ఐ సెల్స్‌తో విజయవంతంగా సంబం...