భారతదేశం, జనవరి 16 -- గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మందా సాల్మన్‌ హత్య ఘటనను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'చంద్రబాబు గారూ మీరు పాలించడానికి అర్హులేనా? రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలితీసుకుంటారు?' అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగం, పొలిటికల్‌ గవర్నెన్స్‌ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "మీ కక్షల పాలన ఫలితంగా ఒక పేదవాడు అయిన మందా సాల్మన్‌ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారు? అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్యచేస్తారా? పైగా సాల్మన్‌పైనే తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా? ఇలాంటి దారుణ...