భారతదేశం, నవంబర్ 13 -- ఇళ్ల నిర్మాణంలో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. వైసీపీ హయంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో పాటు నిర్మాణాలు కూడా చేపట్టామని గుర్తించారు. కానీ సీఎం చంద్రబాబు. వారి ఖాతాలో వేసుకుంటా కథ, స్క్రీన్‌, ప్లే, దర్శకత్వం విజయవంతంగా నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన జగన్. సీఎం చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు.

"చంద్రబాబు గారూ.. మీ కథ, స్క్రీన్‌, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న "క్రెడిట్‌ చోరీ స్కీం'' చాలా బాగుంది. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించలేదు. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా గత ప్రభుత్వం హయాంలోనే ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే నిర్మించిన వాటిని పట్టుకొని"ఇళ్లన్నీ మే...