Vizag,andhrapradesh, ఏప్రిల్ 20 -- విశాఖ మేయర్‌ సీటును కూటమి కైవసం చేసుకోవటాన్ని వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ గుండాయిజం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ మేయర్‌ పదవి నుంచి బీసీ మహిళను దించేయడం.. కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష్య సాక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

"చంద్రబాబు గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం" అని జగన్ దుయ్యబట్టారు.

ప్రజలు ఇచ్చిన తీర్...