Andhrapradesg, జూన్ 1 -- రాష్ట్ర్ ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. డోర్‌ డెలివరీని రద్దు చేయడం ద్వారా ఏం సాధిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. ఈ సందర్భంగా జగన్ ఓ ప్రకటన ద్వారా పలు ప్రశ్నలు సంధించారు.

"చంద్రబాబు గారూ ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు "రేషన్‌'' కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలికానీ, వారిని కష్టపెట్టడం సబబేనా.? ప్రభుత్వ సేవల డోర్‌డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్‌ అవుతుందా.?" అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

9,260 రేషన్‌ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20 వేలమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్...