Andhrapradesh, జూలై 10 -- కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. బంగారుపాళ్యం పర్యటనపై ఎల్లో మీడియాలో ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేసే రైతులకు అండగా నిలబడేవాళ్లంతా మీ దృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలేనా చంద్రబాబు గారు..? అంటూ ప్రశ్నలు సంధించారు.ఇదేం పద్ధతి, ఇదేం విధానం అంటూ దుయ్యబట్టారు.

"సీఎం చంద్రబాబు గారూ.. మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా, వెరవక వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా, తమగోడు చాటుతూ హాజరయ్యారు. ప్రభుత్వ తీరుపట్ల రైతుల్లో ఉన్న ఆగ...