భారతదేశం, డిసెంబర్ 10 -- పెట్టుబడుల కట్టుకథలు చెప్పి, కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ అట్టర్‌ఫ్లాప్ చేశారని మాజీ మంత్రి హరీశ్ రావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌లో విజన్ లేదని. దాన్ని చేరుకునే మిషన్ లేదని దుయ్యబట్టారు. క్యూర్, ప్యూర్, రేర్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ అని విమర్శించారు.

గ్లోబల్ సమ్మిట్‌లో ఎంఓయూల వెనుక చీకటి ఒప్పందాలు, అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఏవీ లేవు అని హరీశ్ రావ్ మండిపడ్డారు. రెండేళ్లుగా కోట్లు ఖర్చు చేసి తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి.? అని ప్రశ్నించారు. అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయని నిలదీశారు. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనేది దానిపై దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డికి...