Telangana,hyderabad, ఏప్రిల్ 18 -- గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకం లేమి తేటతెల్లమైందని లేఖలో ప్రస్తావించారు.

"ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించింది. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడడం ఆక్షేపనీయం. గ్రూప్‌ -1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్ నెంబర్ల కేటాయింపుతో గందరగోళం తెరపైకి వచ్చింది" అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

Published by HT Digital Content Services with permission from H...