భారతదేశం, మే 27 -- అమెరికాలోని భారతీయ విద్యార్థులతో పాటు అంతర్జాతీయ స్టూడెంట్స్​కి డొనాల్డ్​ ట్రంప్​ యంత్రాంగం మరో షాక్​ ఇచ్చింది! యూనివర్సిటీల్లో క్లాస్​లకు వెళ్లకపోతే వీసా రద్దు చేస్తామని, భవిష్యత్తులో మళ్లీ యూఎస్​ వీసాకు అప్లై చేయనివ్వమని అధికారులు వార్నింగ్​ ఇచ్చారు.

"డ్రాపౌట్​ అయినా, క్లాస్​లు స్కిప్​ చేసినా, యూనివర్సిటీకి చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్​ని మధ్యలో వదిలేసినా మీ స్టూడెంట్​ వీసాను రద్దు చేస్తాము. భవిష్యత్తులో యూఎస్​ వీసా అప్లికేషన్​కి మీరు అర్హతను కూడా కోల్పోవచ్చు. వీసా నిబంధనలకు కట్టుబడి ఉండి, సమస్యలు రాకుండా చూసుకోండి," అని భారత్​లోని యూఎస్​ ఎంబసీ నుంచి వచ్చిన అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ మేరకు ఎక్స్​లో ఒక ట్వీట్​ కనిపించింది. ఈ ట్వీట్​ని ముంబై, చెన్నై, హైదరాబాద్​ కోల్​కతాలోని యూఎస్​ కాన్సులేట్స్​ రీట్వీట్​ చేశాయి.

ఈ వ్...