Telangana, ఆగస్టు 3 -- బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను కనీసం బీఆర్ఎస్ నేతలు కనీసం ఖండించలేదన్నారు. ఈ అనుచిత వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద తలకాయ ఉందని ఆరోపించారు. ఇలాంటి నీచ రాజకీయాలను ఎప్పుడు చూడలేదన్నారు.

ఇటీవలే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై కూడా కవిత స్పందించారు. నల్గొండ జిల్లాలో పార్టీ ఓటమికి కారణమైన లిల్లీపుట్ నేత నా గురించి మాట్లాడుతారా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. కేసీఆర్‌ లేకుంటే ఆ లిల్లీపుట్‌ ఎవరు? అంటూ నిలదీశారు. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని సర్వ నాశనం చేసిందే ఈ లిల్లీపుట్" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

లిల్లీపుట్ నాయకుడు మాట్లాడిన తర్వాత. నిన్న మొన్న ఓ చిన్న పిల్లొడు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పె...