Andhrapradesh,kuppam, ఆగస్టు 30 -- ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కుప్పానికి రెండేళ్లు ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చాయన్నారు. కుప్పం ప్రజల ఆనందాన్ని చూస్తే తృప్తి కలుగుతోందని వ్యాఖ్యానించారు. తన సంకల్పం నిజమైందంటూ భావోద్వేగానికి గురయ్యారు.

"నా జీవితంలో ఇది పవిత్రమైన రోజు. మీ ఇంటి బిడ్డగా కుప్పం ప్రజలు నన్ను ఆదరించారు. కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాను.. నా ఆనందం మాటల్లో చెప్పలేను.. నా సంకల్పం నిజమైంది. 738 కిలో మీటర్ల నుంచి కుప్పం పరమసముద్రానికి కృష్ణా జలాలు తెచ్చాం. ఏడు వందల మీటర్లు ఎత్తుకు నీళ్లు తెచ్చాం. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల నిర్మాణంతో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిస్థితి మారింది. అందుకే శతాబ్దాలు గడిచినా....