భారతదేశం, ఏప్రిల్ 13 -- మధ్యప్రదేశ్​లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పలు మీడియా కథనాల ప్రకారం.. 49ఏళ్ల ఆ వ్యక్తికి ఒక మెడికల్​ స్టోర్​ ఉంది. కాగా ఇంట్లోని ఆయన రూమ్​లో నుంచి తుపాకీ శబ్దం వినిపించడంతో కుటుంబ సభ్యులు పరుగులు తీశారు. అప్పటికే ఆయన శవమై కనిపించాడు.

మృతుడి కుమార్తె 15 రోజుల క్రితం వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ కృష్ణ లాల్ చందానీ తెలిపారు.

అనంతరం ఆమెను ఇండోర్​లో గుర్తించి తీసుకొచ్చారు. కోర్టు విచారణ సందర్భంగా తాను చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నానని, భర్తతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు...