భారతదేశం, నవంబర్ 6 -- కర్ణాటక ట్రిప్ ప్లాన్ ఉందా.? అయితే బడ్జెట్ ధరలోనే ఎక్కువ అధ్యాత్మిక ప్రాంతాలను చూపించేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా కర్ణాటక తీర ప్రాంతంలోని పలు అధ్యాత్మిక, టూరిస్ట్ ప్రాంతాలను చూపించనుంది. "Coastal Karnataka' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది.

హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరిని చూడొచ్చు. ట్రైన్ జర్నీ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ 11 నవంబర్ 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఈ వివరాలను IRCTC టూరిజం వెబ్ సైట్ ( https://www.irctctourism.com/ ) లో తెలుసుకోవచ్చు.

హైదరాబాద్ - కర్ణాటక టూర్ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.41,630ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 23,670 ధరగా ఉంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ.19,000గా ఉంది. కంఫ...