Telangana,hyderabad, మే 22 -- కాళేశ్వరం ప్రాజెక్టుపై నికృష్టమైన, నీచమైన రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్, బీజేపీ కలసి కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతుందని వ్యాఖ్యానించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైన చేసిన దుష్ప్రచారం తేలిపోయిందని.తాజాగా సుప్రీం కోర్టు సాక్షిగా నిజాలు బయటకు వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతాయని చెప్పారు. ప్రజాపాలన పర్సంటేజీ పాలనగా మారిందన్న ఆయన. దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే నోటీసుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చాని విమర్శించారు.
"కాంగ్రెస్ పార్టీ కమీషన్లు బయటపడుతున్నాయని తెలిశాకే ఇప్పుడు నోటీసుల పేరిట తమాషాలు చేస్తున్నారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.