భారతదేశం, మే 18 -- డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే.. వివాదాస్పద సినిమాలు, సెన్సేషనల్ ట్వీట్లు, అదుపులేని కామెంట్లు అని ప్రస్తుత తరానికి చెందిన యూత్ చాలా మంది అనుకుంటుంటారు. ఆయనను అలాగే చూస్తుంటారు. అయితే ఒకప్పుడు భారత సినీ ఇండస్ట్రీ ట్రెండ్‍నే మార్చేసిన ఘనత ఆర్జీవీ సొంతం. గతంలో ఏదైనా రంగంలో గణనీయమైన మార్పులకు నాంది పలికిన వారిని ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‍స్టర్) అని ఇప్పటి తరం పిలుస్తుంటుంది. ఇది ఆర్జీవీకి సరిగ్గా సూటవుతుంది. ఒకరకంగా ఇండియన్ ఇండస్ట్రీలోనే సినిమాలు తీసే పద్ధతిలో దశనే మార్చేశారు ఈ రామ్ గోపాల్ వర్మ. టాలీవుడ్‍తో పాటు బాలీవుడ్‍ను షేక్ చేశారు. ఆర్జీవీ పేరు అనేది బ్రాండ్‍లా మారి మారుమోగిపోయింది. ఆయన గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి.

తెలుగు సినిమా చరిత్రలో 'శివ' ఓ రెవల్యూషన్ అని చెప్పవచ్చు. తన తొలి సినిమాతోనే రామ్ గోపాల్ వర్...