భారతదేశం, మే 19 -- ఓలాకు చెందిన ఏఐ విభాగం కృత్రిమ్​లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఆత్మహత్యతో ఇప్పుడు దేశవ్యాప్తంగా 'పని ఒత్తిడి' మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు చేసే పని ఒకరే చేస్తుండటంతో, ఒత్తిడి తట్టుకోలేక సదరు ఉద్యోగి మరణించాడని సోషల్​ మీడియాలో పోస్టులు వైరల్​ అయ్యాయి. దీనిపై స్పందించిన ఓలా.. ఆ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో సెలవులో ఉన్నట్టు వెల్లడించింది.

విపరీతమైన పని ఒత్తిడి కారణంగానే ఆ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఓ సహోద్యోగి రెడ్డిట్ పోస్టులో ఆరోపించారు. ఓలా ఏఐ విభాగం కృత్రిమ్​లో పనిచేస్తున్న ఫ్రెషర్ ఉద్యోగికి ముగ్గురు వ్యక్తుల పనిభారాన్ని అప్పగించారని, దానిని తట్టుకోలేక అతను ప్రాణాలు తీసుకున్నాడని పోస్ట్​లో పేర్కొన్నారు.

"ఇది ఇంకా పబ్లిక్ ఎందుకు కాలేదో తెలియదు, నా సహోద్యోగి తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా తన జీవితాన్ని విడి...