భారతదేశం, ఏప్రిల్ 8 -- మక్కాలో లేదా దేశవ్యాప్తంగా ఉమ్రా యాత్రికులు, హజ్ యాత్రికులు అక్రమంగా గుమికూడకుండా నిరోధించడానికి సౌదీ అరేబియా 14 దేశాల వీసాలను తాత్కాలికంగా నిషేధించింది. ఇందులో భారత్ కూడా ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఉమ్రా కోసం వీసాలు పొందిన వారు ఏప్రిల్ 29 లోగా ఉమ్రా పూర్తి చేసి తమ దేశాలకు తిరిగి వెళ్లాలని ప్రకటించింది. విదేశీ ఉమ్రా యాత్రికులు దేశం విడిచి వెళ్లడానికి ఏప్రిల్ 29 చివరి రోజు అని మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

'ఈ సంవత్సరం ఉమ్రా యాత్రికులకు సౌదీ అరేబియాలోకి ప్రవేశించడానికి చివరి తేదీ ఏప్రిల్ 13, తీర్థయాత్ర కాలం ఏప్రిల్ 29న ముగుస్తుంది.' అని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనను ఉటంకిస్తూ గల్ఫ్ న్యూస్ తెలిపింది. ఈ గడువు తర్వాత సౌదీ అరేబియాలో ఉంటున్న యాత్రికులను ఆ దేశ వీసా, తీర్థయాత్ర నిబంధనలన...