Telangana,hyderabad, జూన్ 14 -- బనకచర్ల పేరుతో ఏపీ ప్రభుత్వం జలదోపిడీకి దిగుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. "బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో ఏపీ చేస్తున్న జల దోపిడి - కాంగ్రెస్ మౌనం" అంశంపై తెలంగాణ భవన్ లో ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును దుయ్యబట్టారు.

కృష్ణా జలాల్లో జలదోపిడి జరిగినట్లు, గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఏపీ దోపిడి చేస్తున్నదని హరీశ్ రావు ఆరోపించారు. "సీఎం రేవంత్, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు. కేటీఆర్ మీద, బిఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడంలో బిజీ ఉన్నారు. ప్రతిపక్షాల మీద ఇరిటేషన్ తప్ప, ఇరిగేషన్ మీద దృష్టి లేదు. రాష్ట్ర ప్రయోజనాలు పదవుల కోసం తాకట్టు పెడుతున్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టు కడుతుంటే మీ మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి? గోదావరి బనకచర్లకు టెండర్ల...