Andhrapradesh, ఏప్రిల్ 26 -- రాష్ట్రంలో ఉంటున్న పాకిస్థాన్ పౌరులంతా ఈ నెల 27లోగా వెళ్లిపోవాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో. కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా. ఏపీ పోలీసులు కూడా పాక్ పౌరుల విషయంలో ఆదేశాలను జారీ చేశారు.

పాకిస్థానీలకు జారీ చేసిన అన్ని వీసాలను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో ఏపీ డీజీపీ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 27లోగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

విదేశీయుల చట్టం 1946 కింద పాకిస్థానీయులకు జారీ చేసిన వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని తన ప్రకటనలో పేర్కొన్నారు. మెడికల్ వీసాలపై వచ్చిన పొర...