భారతదేశం, జనవరి 23 -- భారతీయ రైల్వే చరిత్రలో తొలి రోబో పోలీస్ వచ్చేశాడు. ఇందుకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ వేదికైంది. తూర్పుకోస్తా జోన్ వాల్తేరు డివిజన్‌లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌ జనరల్ (ఐజీ)అలోక్ బొహ్రా, డీఆర్ఎం లలిత్‌బొహ్రా చేతుల మీదుగా ఈ రోబో కాప్ ను ఆవిష్కరించారు.

ప్రయాణీకుల భద్రతా సేవలను మరింత పెంపొందిచే దిశగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడిన రోబ్ పోలీసును ఏర్పాటు చేశారు. దీనికి "ఏఎస్సీ అర్జున్" గా పేరు పెట్టగా. భారతీయ రైల్వేలో ఇది మొదటిది.

ఈ రోబోను పూర్తిగా విశాఖపట్నంలో రూపొందించి అభివృద్ధి చేశారు. దేశీయ ఆవిష్కరణల ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ అలోక్ బోహ్రా మరియు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా మార్గదర్శకత్వంలో ఎ.కె. దూబే నేతృత్వ...