Telangana, ఏప్రిల్ 27 -- తెలంగాణ ప్రభుత్వం అనధికార లేఅవుట్లకు రెగ్యులరైజేషన్ కు ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాయితీతో ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది. మార్చి 31వ తేదీతోనే గడవు ముగియగా. ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించింది. అయితే ఈ గడువు కూడా దగ్గరపడింది. మరో మూడు రోజుల్లో ఈ అవకాశం ముగియనున్న నేపథ్యంలో. దరఖాస్తుదారులు వెంటనే ఫీజులు చెల్లించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏప్రిల్ 30 లోగా ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ అవకాశం ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత అలాంటి అవకాశం ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించగా.. మరోసారి పెంచే అవకాశం లేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఎల్ఆర్...