భారతదేశం, జనవరి 23 -- అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత చర్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మిన్నెసోటాలోని కొలంబియా హైట్స్ సబర్బ్‌లో ప్రీ-స్కూల్ ముగించుకుని ఇంటికి వెళుతున్న ఐదేళ్ల బాలుడు లియామ్ కోనెజో రామోస్‌ను ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లాడిని పట్టుకోవడమే కాకుండా, తన తండ్రిని బయటకు రప్పించేందుకు ఆ పసివాడిని 'ఎర'గా వాడుకున్నారని పాఠశాల అధికారులు, కుటుంబ న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు.

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఇంటి ముందు కారులో ఉన్న లియామ్, అతని తండ్రిని ఏజెంట్లు చుట్టుముట్టారు. "లోపల ఎవరైనా ఉన్నారో లేదో చూడటానికి ఆ పసివాడిని ఇంటి తలుపు తట్టమని అధికారులు చెప్పారు. అంటే ఒక ఐదేళ్ల బాబును వారు ఎరగా వాడుకున్నారు," అని కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్స్ సూపర్ టెండెంట్ జెనా స్టెన్విక్ మీడియ...