భారతదేశం, అక్టోబర్ 3 -- ఆపరేషన్​ సిందూర్​పై భారత వైమానిక దళం (ఐఏఎఫ్​) మరోసారి కీలక ప్రకటన చేసింది. మే నెలలో నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా తాము పాకిస్థాన్​కి చెందిన యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్​ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారతదేశ సైనిక చర్య గురించి వక్రీకరించిన వాస్తవాలను ప్రస్తావించిన కొద్ది రోజులకే భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.

93వ వైమానిక దళ దినోత్సవ వేడుకల సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ మాట్లాడుతూ, ఎఫ్​16, జేఎఫ్​17 రకానికి చెందిన ఐదు పాకిస్థాన్​ యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసిందని తెలిపారు.

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా, భారతదేశం పాకిస్థాన్​లోని అనేక ఎయిర్‌ఫీల్డ్‌లు, స్థావరాలపై దాడులు చేసిందని, ఇది ఆ దేశానికి చెందిన రాడార్లు, కమాండ్ అండ్ కంట్...