భారతదేశం, జూలై 8 -- రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో 35 శాతం రిజర్వేషన్లలను బీహార్ శాశ్వత నివాసులైన మహిళలకు మాత్రమే ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం జూలై 8 న ప్రకటించింది. గతంలో బయటి రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్హులుగా ఉండేవారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సంవత్సరం చివరలో బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

బిహార్ కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వ సేవలు, ఉద్యోగాలకు సంబంధించిన అన్ని ప్రత్యక్ష నియామకాల్లో 35 శాతం రిజర్వేషన్లను బిహార్ లో శాశ్వత నివాసులైన స్థానిక మహిళా అభ్యర్థులకు మాత్రమే కల్పిస్తారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం కోటాను బీహార...