Telangana,hyderabad, జూలై 5 -- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి స్ఖాయికి కేసీఆర్ అవసరం లేదని.తామే చాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎక్కడ చర్చ పెట్టినా తాము సిద్ధమన్నారు. అసెంబ్లీ అయినా సరే వస్తామని చెప్పారు. అయితే దమ్ముంటే ఈనెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రావాలని. అక్కడే మీడియా ముందు చర్చిద్దామని ప్రతి సవాల్ విసిరారు.

"నువ్వు ఒక 72 గంటలు సమయం తీసుకొని ప్రిపేర్ అయ్యి చర్చకు రా. లేకుంటే చర్చకు వచ్చి బేసిన్లను.. బెండకాయలు అంటే ఇజ్జత్ పోతది. నీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు కానీ.. ఆయన ముచ్చట పడుతుండు కాబట్టి బనకచర్ల పై ఎపుడైనా, ఎక్కడైనా చర్చకు మేము రెడీ. పార్టీ తరపున నేనే మాట్లాడుతా. మేమెప్పుడు ప్రిపేర్ అయ్యే ఉంటాం. కాకుంటే వాళ్ళు ప్రిపేరవ్వా...