Andhrapradesh, జూలై 16 -- రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన. రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందన్న జగన్. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒక్కటే స్పందిస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఆరోపించారు. సూపర్ సిక్స్ సహా 143 హామీలిచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఫైర్ అయ్యారు.

విద్యార్థులకు వసతి దీవెన ఇవ్వలేదని ఆరోపించిన జగన్. విద్యార్థులు చదువులు ఆపేసి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారం చేపట్టి ఏడాది దాటింది. నిరుద్యోగ భృతి సంగతేంటి? అని ప్రశ్నించారు. ఏడాదిలో కరెంట్ ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్ల భారం ...