భారతదేశం, జూన్ 21 -- కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్న విషయంలో గొడవ పడిన తర్వాత 27 ఏళ్ల మహిళను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన డిజిటల్ వ్యసనం, కుటుంబ కలహాల చీకటి కోణాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.

శంకరనారాయణ పోలీస్ స్టేషన్​ పరిధిలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. నివేదిక ప్రకారం.. నిందితుడు 42 ఏళ్ల గణేష్ పూజారి, పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. బ్రహ్మవర తాలూకాలోని హోసమఠ, హిలియానా గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అతని భార్య రేఖ శంకరనారాయణలోని ఒక పెట్రోల్ బంకులో అటెండెంట్‌గా పనిచేస్తోంది. రేఖ తన మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూడటంపై ఈ దంపతులు తరచుగా గొడవపడేవారు. ఈ విషయం ఇంతకుముందు పోలీసుల జోక్యానికి కూడా దారితీసిందిఒ! వారి కుటుంబ వివాదాలపై హెచ్చరిక అందిన తర్వాత అధికారులు గతంలో ఈ దంపతుల...