Telangana, సెప్టెంబర్ 12 -- తెలంగాణలో ఎమ్మెల్యే చోరీపై రాహుల్ గాంధీ సిగ్గుపడాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేల చోరీ గురించి మాట్లాడకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న ఓటు చోరీ కంటే దారుణమైన నేరమంటూ ప్రశ్నలు సంధించారు.

'ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా..?' అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో "ఓటు చోరీ" గురించి నీతులు చెబుతున్న రాహుల్ గాంధీ. తెలంగాణలో జరుగుతున్న "ఎమ్మెల్యేల చోరీ" గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ టికెట్లపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, ఇప్పుడు తాము పార్టీ మారలేదంటూ చేస్తున్న వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇంత బహిరంగ...