Hyderabad, సెప్టెంబర్ 20 -- తెలుగులో వస్తున్న న్యూ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ఇట్లు మీ ఎదవ. త్రినాథ్ కఠారి హీరోగా నటించిన ఈ సినిమాకు ఆయనే స్వీయ దర్శకత్వం వహించారు. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత బళ్లారి శంకర్ ఇట్లు మీ ఎదవ సినిమాను నిర్మిస్తున్నారు.

మన తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ ఇట్లు మీ ఎదవ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే, 'ఇట్లు మీ ఎదవ'అనే ఆసక్తికరమైన టైటిల్ అందరిని అట్రాక్ట్ చేస్తుంది. దీనికి వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఇట్లు మీ ఎదవ టైటిల్ గ్లింప్స్‌ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇట్లు మీ ఎదవ టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో బుచ్చిబాబు సాన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబ...