భారతదేశం, డిసెంబర్ 6 -- ఇండిగో విమాన కార్యకలాపాలు "స్థిరంగా మళ్లీ ప్రారంభమవుతూ, సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి" అని దిల్లీ విమానాశ్రయం ఒక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం ఇండిగో ఎయిర్‌లైన్స్ దాదాపు 1,000 విమానాలను రద్దైన తరుణంలో దిల్లీ విమానాశ్రయం నుంచి ఈ ప్రకటన వెలువడటం ప్రయాణికులకు ఊరటనిచ్చే విషయం.

అయితే ప్రయాణికులు ఇంటి నుంచి బయలుదేరే ముందు తమ ఫ్లైట్​ స్టేటస్​ని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని విమానాశ్రయం సూచించింది.

"కొద్దిపాటి అంతరాయం తర్వాత ఇండిగో విమాన కార్యకలాపాలు ఇప్పుడు స్థిరంగా పుంజుకుంటూ, సాధారణ స్థితికి వస్తున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఇంటి నుంచి బయలుదేరే ముందు దయచేసి మీ బుకింగ్, ఫ్లైట్​ స్టేటస్​ని తనిఖీ చేసుకోండి," అని దిల్లీ విమానాశ్రయం వెల్లడించింది.

శుక్రవారం అర్ధరాత్రి వరకు దిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేర...