భారతదేశం, జూలై 29 -- పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మతం రంగ పులిమే ప్రయత్నాలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం సున్నితంగా తిప్పికొట్టారు. బాధితులు హిందువులు అని లోక్ సభలో కొంతమంది ఎంపీలు వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ ''వారు భారతీయులు'' అని ప్రతిస్పందించారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్ సభలో ఆపరేషన్ సింధూర్ పై జరిగిన ప్రత్యేక చర్చలో ఆమె ప్రసంగించారు.

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో 26 మందిని బలిగొన్న ఉగ్రదాడి విషయంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రం వ్యవహరించిన తీరుపై ఆమె ఘాటుగా స్పందించారు. పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో కేంద్ర బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ''నిన్న రక్షణ మంత్రి గంటకు పైగా మాట్లాడారు. చరిత్ర అంతా చెప్పుకొచ్చారు. ఉగ్రవాదం, జాతీయ భద్రత గురించి మాట్లాడారు. అయితే పహల్గామ్ దాడి ఎలా జరిగిందనే ప్రశ్...