భారతదేశం, జూలై 25 -- పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి, తదనంతరం భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో సోమవారం ప్రత్యేక చర్చ జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

పహల్గామ్ ఉగ్రదాడితో పాటు, ఆపరేషన్ సిందూర్ పై సోమవారం లోక్ సభలో ప్రత్యేక చర్చ జరపాలని పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించిందని రిజిజు తెలిపారు. ఈ ప్రత్యేక చర్చకు 16 గంటల సమయం కేటాయించినట్లు ఆయన తెలిపారు. రాజ్యసభలో ఇదే అంశంపై మంగళవారం చర్చ జరగనుంది. పార్లమెంట్ లో చర్చ కోరుతూ ప్రతిపక్షాలు లేవనెత్తాలనుకుంటున్న అంశాలు చాలా ఉన్నాయని, అయితే ముందుగా ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరగాలని తాము భావించామని,అందుకు అన్ని పక్షాలు అంగీకారం తెలిపాయని ఆయన చెప్పారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....