భారతదేశం, మే 15 -- ఛత్తీస్ గఢ్ -తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో 21 రోజులుగా జరుగుతున్న ఆపరేషన్‌లో 31మంది మావోయిస్టులు మృతి చెందారు. మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ లో 31 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు భద్రతా దళాలు బుధవారం ప్రకటించాయి.

నక్సల్స్ రహిత భారత్ సంకల్పంలో భాగంగా చారిత్రాత్మక విజయం సాధించినట్టు సీఆర్‌పిఎఫ్‌ బుధవారం ప్రకటించింది. ఛత్తీస్ గఢ్ -తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలపై మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిగిన 21 రోజుల ఆపరేషన్‌లో భద్రతా దళాలు 31 మంది మావోయిస్టులను హతమార్చాయి.

కర్రెగుట్టల్లో 350మంది మావోయిస్టులు ఆశ్రయం పొందుతుండగా వారిలో చాలామంది తీవ్రంగా గాయపడటమో, మరణించడమో జరిగిందని భావిస్తున్నారు. భౌగోళిక సంక్లిష్టతలతో మృతదేహాలను బయటకు తీసుకు రాలేకపోయినట్టు ప్రకటించారు.

ఆపరే...