భారతదేశం, మే 3 -- ఆంధ్రుల రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులు షురూ అయ్యాయి. గత ఐదేళ్లుగా నిలిచిపోయిన పనులను తిరిగి పట్టాలెక్కించే పనిలో ఏపీ ప్రభుత్వం పడింది. ఇందులో భాగంగా అమరావతి పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఇందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. భారీ సభా వేదికపై నుంచి కీలకమైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునరుద్ధరణ సహా రాష్ట్ర పరిధిలో రూ.58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన శంకుస్థాపన చేశారు. అంతేకాదు రాజధాని నిర్మాణానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీనిచ్చారు. అమరావతి అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదని. ఒక శక్తి అంటూ వ్యాఖ్యానించారు.

రాజధాని పనుల పునరుద్ధరణ పనుల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వర్గాల్లో మళ్లీ ఆశలు చిగురుస్త...