భారతదేశం, జూన్ 24 -- 'అప్పు చేసి పప్పు కూడు తినొద్దు' అనే సామెతను భారత యువతరం ఇప్పుడు నిజంగానే ఆచరిస్తోంది. గతంలో మాదిరిగా అనవసర ఖర్చులకు విచ్చలవిడిగా రుణాలు తీసుకోవడం లేదు., అవసరం ఉన్నా లేకున్నా వస్తువులు ఖరీదైన కొనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

తమ వద్ద ఉన్న డబ్బును పొదుపు చేయడానికి, లేదా వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తప్పనిసరి అయితేనే, అది కూడా స్థిరాస్తులు లేదా చరాస్తులు సమకూర్చుకోవడానికి మాత్రమే అప్పు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. రెండు మూడు క్రెడిట్ కార్డులున్నా, 'పొదుపు' మంత్రాన్ని పాటిస్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా జాబ్ మార్కట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, పెద్ద పెద్ద కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తూ లే ఆఫ్ లు ప్రకటిస్తుండడం, ఎర్లీ రిటైర్మెంట్ గురించిన ఆలోచనలు ...