భారతదేశం, జనవరి 12 -- ప్రభుత్వంలోని ప్రతీ శాఖ ప్రజ‌ల‌కు అందించే అన్ని సేవ‌ల‌ను త‌ప్పనిస‌రిగా ఆన్‌లైన్‌లోనూ, మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లోనే అందించాల‌ని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యద‌ర్శి భాస్కర్ కాటంనేని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో స‌చివాల‌యంలో మంత్రులు, ప్రభుత్వ శాఖ‌ల కార్యద‌ర్శుల‌తో జ‌రిగిన స‌ద‌స్సులో ఆయ‌న డేటా డ్రివ‌న్ గ‌వ‌ర్నెన్స్‌, ఆర్టీజీఎస్ కార్యకలాపాల గురించి వివ‌రించారు.

వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ మ‌న‌మిత్ర ద్వారా ప్రజ‌ల‌కు ప్రభుత్వ సేవ‌ల‌న్నీ ఎలాంటి అంత‌రాయం లేకుండా అందించాల‌నేది ముఖ్యమంత్రి ఆశ‌య‌మ‌ని, దానికి అనుగుణంగా ఇప్పటికే అన్ని చ‌ర్యలు తీసుకున్నామ‌న్నారు భాస్కర్ కాటంనేని. అయితే ఇప్పటికీ కొన్ని శాఖ‌లు మాన్యువ‌ల్‌గా సేవ‌లందిస్తున్నాయ‌ని, ఇక‌పైన ప్రజ‌ల‌కు ప్రభుత్వ శాఖ‌లు అందించే సేవ‌ల‌న్నీ కూడా ఆన్‌లైన్ ద్వారా,...