Andhrapradesh, జూన్ 28 -- రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మూడు దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.

అయితే పీఎం కిసాన్ నిధులను జూలై లో విడుదల చేసే అవకాశం ఉంది. వీటితో కలిపే ఏపీ అన్నదాత సుఖీభవ స్కీమ్ డబ్బులను కూడా జత చేయనున్నారు. ఈ పథకం అమలు కోసం అధికారులు కసరత్తు చేస్తుండగా. తాజాగా ముఖ్యమ...