Andhrapradesh, జూలై 9 -- అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధుల విడుదలకు ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. అయితే పీఎం కిసాన్ నిధులతో పాటు వీటిని విడుదల చేయనుంది. ఇప్పటికే అర్హుల జాబితాను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇందులో పేర్లు లేని వారు అర్జీలు పెట్టుకోవచ్చని ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే ఈ గడువు జూలై 13వ వరకు మాత్రమే ఉందని పేర్కొంది.

అర్హత ఉన్న రైతుల జాబితాను సంబంధిత రైతుసేవా కేంద్రంలో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ తాజాగా వెల్లడించింది.అనర్హులైన రైతులు అర్జీలను పెట్టుకోవాలని. ఆలస్యం చేయవద్దని పేర్కొంది. అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు వెంటనే..రైతు సేవా కేంద్రాన్ని సందర్శించాలని సూచించింది. అర్జీతో పాటు తగిన పత్రాలను సమర్పించాలని పేర్కొంది.

రైతు సేవా కేంద్రంలో ఫిర్యాదులు ఇస్తే.. అక్కడ సిబ్బంది పరిశీలిస్తారు. ఆ తర్వాత అన్నదాత సుఖీభవ ...