భారతదేశం, డిసెంబర్ 3 -- మనీ ల్యాండరింగ్ కేసు పేరుతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ చోరీ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లడంతో ఆవిషయాన్ని దృష్టి మరల్చేందుకు మళ్లీ కేసుల పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేస్తున్నామని చెప్పారు.సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తెలంగాణ ప్రజలంతా అండగా నిలుస్తామని. అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తామని వ్యాఖ్యానించారు.

మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన పాత, కొత్త డీసీసీ అధ్యక్షులతో నిర్వహించిన పీసీసీ కార్యనిర్వాహక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ పోరాడేందుకు సిద్ధం...