భారతదేశం, నవంబర్ 27 -- 'డిజిటల్ అరెస్ట్'. గత కొంతకాలంగా ఈ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా. చాలా మంది సైబర్ మోసగాళ్ల వలలో చికిపోతున్నారు. వేల నుంచి లక్ష రూపాయల వరకు ఈజీగా కొట్టేస్తున్నారు. ఇందుకోసం అనేక రకాల పేర్లు వాడేస్తున్నారు. ఇదే మాదిరిగా కాంబోడియా దేశాన్ని అడ్డాగా చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో ఓ ముఠా దందా సాగిస్తోంది. ఈ సైబర్ నేరాల ముఠా గుట్టును భీమవరం పోలీసులు రట్టు చేశారు.

భీమవరానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ శర్మకు ఇటీవల ఒక ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తులు మాట్లాడుతూ తాము సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థల అధికారులమని పరిచయం చేసుకున్నారు. సిమ్ కార్డులో తేడాలున్నాయని అని చెబుతూ నమ్మబలికారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయాందోళనకు గురి చేశారు. దీంతో టెన్షన్ కు గురైన సదరు వ్యక్తి.. అతని బ్యాంక్ ఖాతా, ఆధార్ వివరాలను చెప్ప...