భారతదేశం, ఏప్రిల్ 10 -- ‌Hyd Scientist Suicide: కుమార్తెను చూడనివ్వకుండా, ఆమె పుట్టిన రోజున కొత్త బట్టలు కొనవ్వకుండా అడ్డుకుని దాడి చేయడంతో మనస్తాపం చెెందిన భర్త హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విడాకుల సమయంలో పిల్లలు ఆడవారి ఆస్తులు కాకూడదని లేఖ రాసి బలవన్మరణం పాలయ్యాడు. తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవాలని తమ్ముడికి సూచించాడు.

భార్య తన చావు కోరుకుందని, కుమార్తెను తల్లికి అప్పగించడంతో తల్లడిల్లిన తండ్రి ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతుర్ని విడిచి ఉండలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ‌్ర ప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామంలో లక్ష్మీ తులసి కిరాణా మర్చంట్స్ పేరిట వ్యాపారం చేసే పొట్టి సత్యనారా యణ, భారతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

వీరి పెద్ద కుమారుడు రామకృష్ణ హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీలో సీనియర్ శాస్త్రవేత్తగా ప...