భారతదేశం, ఫిబ్రవరి 3 -- ‌Hindupur Municipality: హిందూపురం మునిసిపాలిటీలో వైసీపీకి ఓటమి తప్పలేదు. వైసీపీ విప్‌ జారీ చేసినా ఆ పార్టీ కౌన్సిలర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. హిందూపురం మునిసిపల్ ఛైర్మన్‌గా రమేష్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలోనే ఉండి ఎన్నికకు సారథ్యం వహించారు.

వైసీపీ కౌన్సిలర్లు దూరంగా ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థికి మెజార్టీ దక్కలేదు. బాలయ్య ఆశీస్సులతో మునిసల్‌ ఛైర్మన్‌గా ఎన్నికైనట్టు ఛైర్మన్‌ రమేష్‌ కుమార్‌ చెప్పారు. టీడీపీ అభ్యర్థి రమేష్‌కు 23 ఓట్లు దక్కగా వైసీపీ అభ్యర్థి లక్ష్మీకి 14ఓట్లు దక్కాయి. పలువురు వైసీపీ కార్పొరేటర్లు ముందుగానే టీడీపీ గూటికి చేరిపోయారు.

50మంది కార్పొరేటర్లు ఉన్న ఏలూరు కార్పొరేషన్‌లో టీడీపీకి 30మంది సభ్యుల బలం ఉంది. తగినంత బలం లేకపోవడంతో వైసీపీ కార్పొరేటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నా...