వరంగల్,మామునూరు, జనవరి 26 -- మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై భారీ ఐరన్ మెటీరియల్ లోడ్ తో వెళ్తున్న లారీ తాడు తెగిపోవడంతో ఘటన జరిగింది. పక్కనే ఉన్న ఆటోలతో పాటు ఓ కారుపై ఐరన్ రాడ్లు పడిపోయాయి.

ఈ ఘోర ప్రమాదంలో ఓ ఆటో పూర్తిగా నజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడకిక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న మామునూరు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....