భారతదేశం, డిసెంబర్ 7 -- ఓటీటీల క్రేజ్ పెరిగాక భాషతో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ వేరే లాంగ్వేజీలోని సినిమాలనూ తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్లను బాగా ఇష్టపడుతున్నారు. తమిళ, మలయాళం, కన్నడ థ్రిల్లర్లకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఆయా భాషల్లో సినిమాలు ఉన్నా చూడటానికి వెనుకాడటం లేదు. ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతుంది. ఇది గుజరాతీ థ్రిల్లర్ మూవీ 'శుభచింతక్'.

క్రైమ్ థ్రిల్లర్ శుభచింతక్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ శుభచింతక్ మూవీ డిసెంబర్ 11న ఓటీటీలో అడుగుపెట్టనుంది. షెమరూమీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. థ్రిల్లర్లు ఇష్టపడే ఆడియన్స్ కు శుభచింతక్ సినిమా మంచి ఆప్షన్.

శుభచింతక్ సినిమా మే 30, 2025న థియేటర్లలో ర...