భారతదేశం, ఏప్రిల్ 23 -- ్యుందాయ్ పూర్తి ఎలక్ట్రిక్ క్రెటా ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. కొత్త హ్యుందాయ్ క్రెటా అనేది అనేక ఫీచర్లతో నిండిన ఎలక్ట్రిక్ కారు. ఇది సిటీ డ్రైవ్‌లకు, లాంగ్ డ్రైవ్‌లకు రెండింటికీ మంచి ఆప్షన్. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తిగా ఛార్జ్ చాలా దూరం ప్రయణించొచ్చు.

హ్యుందాయ్ క్రెటా ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్స్‌లో లభిస్తుంది. దీని మొదటి 42 kWh బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 390 కిలోమీటర్ల రేంజ్ వరకు వస్తుంది. అదే సమయంలో 51.4 kWh బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్‌పై 473 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

హ్యుందాయ్ క్రెటా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. ఈ వాహనాన్ని కేవలం 58 నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అదే సమయంలో మీరు ఇంట్లో 11 kW ఏసీ ఛార్జర్‌ని ఉపయోగిస్తే బ్యాటరీని 4 న...